Suicide | ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి సుచరిత ఎస్కార్ట్ కాన్వాయ్ డ్రైవర్ చెన్నకేశవ రెడ్డి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.గుంటూరులోని బ్రాడీపేటలో గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆఫీసు రూమ్లో తోటి అధికారి రివాల్వర్ తీసుకుని కాల్చుకుని బలవర్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ అరిఫ్ హఫీజ్ పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు తెలియాల్సి ఉంది.