తిరుమల మూడో ఘాట్ రోడ్డు వద్దే వద్దు.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
Congress Rally: తిరుమల కొండపైకి వెళ్లేందుకు టీటీడీ నిర్మించతలపెట్టిన అన్నమయ్య మూడో ఘాట్ రోడ్డును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీ ...

(Congress Rally) తిరుపతి: తిరుమల కొండపైకి వెళ్లేందుకు టీటీడీ నిర్మించతలపెట్టిన అన్నమయ్య మూడో ఘాట్ రోడ్డును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాయం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి వై గోపి ఆధ్వర్యంలో జరిగింది.
తిరుమలను ఏదో అభివృద్ధి చేస్తున్నమని గొప్పలు చెప్పుకోవడానికే అన్నమయ్య ఘాట్ రోడ్డును నిర్మించేందుకు బోర్డు ముందుకొచ్చిందని ఈ సందర్భంగా గోపీ ఆరోపించారు. మామండూర్ నుంచి ఘాట్ రోడ్డు ప్రారంభమైతే.. రానున్న రోజుల్లో తిరుపతి అభివృద్ధి నిలిచిపోవడం ఖాయమన్నారు. దీని వల్ల వ్యాపారాలు దెబ్బతినే అవకాశాలతోపాటు అటవి కూడా నాశనం అవుతుందని విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మజీద్ పటేల్, కొట్టాల మహేశ్ బాబు, ఎన్ ఎస్యూఐ నాయకుడు షేక్ సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, మూడో ఘాట్ రోడ్డు ప్రతిపాదనను టీటీడీ విరమించుకోవాలని రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం (ఆర్ఐఎఫ్) కన్వీనర్ ఎం పురుషోత్తంరెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

