YCP Complaint | టీడీపీ నాయకుల తప్పుడు ఆరోపణలపై సీఈవోకు వైసీపీ నాయకుల ఫిర్యాదు
YCP Complaint | విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అమరావతి : విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఈవో ముఖేష్కుమార్మీనాను వైసీపీ నాయకులు పేర్నినాని(Perni Nani) , లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆదారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసే వారిపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్కు విదేశాల్లో ఉన్న కొందరితో సత్సంబంధాలు ఉన్నాయని వారే అక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించారని ఫిర్యాదు చేశారు.
డ్రగ్స్ స్వాధీనంపై లోతుగా విచారణ జరపాలని కోరారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతాడని విమర్శించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెక్కుల పంపిణీ చేసి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

