అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ( Kasibugga ) వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిలాటలో ( Stampede ) మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదివారం పరిహారాన్ని(Compensation) అందజేసింది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజవరపు రామ్మోహన్నాయుడు ( Rammohan Naidu) , రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు టెక్కలి నియోజకవర్గం పరిదిలోని శివరాంపురం, రామేశ్వరం, పిట్టలిసరియా గ్రామానికి చెందిన మృతులకు రూ. 15 లక్షల చొప్పున అందజేశారు.
ఘటన జరగడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, కేంద్రం నుంచి మరో రూ.2 లక్షలు ఆర్థిక సహాయాన్ని త్వరలోనే అందిస్తామని వెల్లడించారు. కాశీబుగ్గ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను ఆనం రాంనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. అంతకుముందు ఘటనా స్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. తొక్కిసలాటపై దర్యాప్తునకు ముగ్గురు అధికారులతో కమిటీ వేశామని వెల్లడించారు. ఆలయాల ఉత్సవాలు జరిగే సమయంలో ముందస్తు సమాచారముంటే బందోబస్తు చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.