అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) తనను తాను అర్జునుడి (Arjun ) గా పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. మచిలిపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి ఆదివారం జనసేనలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ మాట్లాడారు. భారతంలో అర్జునుడు ఆడపడుచులను గౌరవించారే తప్ప ఎన్నడూ అగౌరవపరచలేదని అన్నారు. ఏపీలో సొంత చెల్లి షర్మిల (Sharmila)కు గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్ రాష్ట్ర మహిళలకు గౌరవం ఇస్తాడని అనుకోవట్లదేదని పేర్కొన్నారు.
ఆమె పట్ల అత్యంత నీచంగా మాట్లాడుతుంటే ప్రోత్సహించే వ్యక్తి అర్జునుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. వైఎస్ వివేకా కుమార్తె తనకు రక్షణ లేదని ఆవేదన చెందుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో సీఎం మాట్లాడే ప్రతీ మాటకు కౌంటర్లు ఇస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ వ్యక్తిగతంగా దిగజారి రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. వచ్చే తరానికి విలువలున్నా రాజకీయాలు చూపించడానికి వచ్చానని స్పష్టం చేశారు.
ప్రజల మనిషిగా ఇష్టపడడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. జగన్ అన్ని అబద్ధాలే చెబుతారని ఆరోపించారు. సీపీఎస్ రద్దు, మద్యపానం రద్దు, ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఏం చేశారని ఆరోపించారు. జనసేన అసెంబ్లీ బలమైన పాదముద్ర వేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. జగన్ దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాడానికి నడుం కట్టాలని పిలుపునిచ్చారు.