అడ్మిషన్ల కోసమే ఈ తతంగం : చిత్తూరు ఎస్పీ
పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను అరెస్ట్ చేశామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. ఈయనతో పాటు తిరుపతి డీన్‌ను కూడా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. నారాయణ స్కూళ్లల్లో అడ్మిషన్లను పెంచేందుకే ఇలా పేపర్‌ను లీక్ చేశారని ఎస్పీ వెల్లడించారు. మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధిపతి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 27న టెన్త్ పేపర్ మాల్ ప్రాక్టీస్ జరిగిందని, చిత్తూరు పీఎస్‌లో నమోదైన కేసులో అంతర్భాగంగా నారాయణ అరెస్ట్ జరిగిందని ఎస్పీ వివరించారు.
ముందుగానే మాట్లాడుకొని, ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారని, సమాధానాలు రాసి, లోపలికి పంపే ప్రయత్నాలు కూడా చేశారని ఎస్పీ రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మార్కుల కోసమే ఈ మాల్ ప్రాక్టీసింగ్ చేశారని ఎస్పీ వెల్లడించారు. ఇన్విజ్ లేటర్ల వివరాలు ముందే తెలుసుకొని, మాల్ ప్రాక్టీస్ చేసేవారని తెలిపారు. అంతేకాకుండా వారి దగ్గర చదువుకునే విద్యార్థులను రెండు భాగాలుగా విభజించి, ఏఏ విద్యార్థులు ఎక్కడెక్కడ పరీక్ష రాస్తారో తెలుసుకుంటారని అన్నారు. హెడ్ ఆఫీస్ నుంచే కీ తయారు చేసి విద్యార్థులకు పంపుతారని ఎస్పీ వెల్లడించారు.
యావరేజ్ విద్యార్థుల సెంటర్లకు పేపర్‌ను ముందుగానే అందించారని, ఇన్విజ్లేటర్స్ను మేనేజ్ చేసుకొని, ఇదంతా చేశారని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఇన్విజ్లేటర్స్ ద్వారా క్వశ్చన్ పేపర్ ఫొటో తీసి, బయటకు పంపేవారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఏడుగురిని అరెస్ట్ చేశామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

