అమరావతి : నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుత దాడి (Cheetah attack ) చేసిన ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి . మహానంది మండలం గాజులపల్లె శివారు చలమ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 20 మంది రైల్వే కూలీలు (Railway Labours) పనులు చేస్తున్నారు. గురువారం కూలీలు పనిచేస్తుండగా పొదల నుంచి వచ్చిన చిరుత కూలీలపై దాడి చేసింది. ఈ దాడిలో పాండవ్ అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను సహచర కూలీలు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.