అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ( Nara Devansh) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను ( World Book of Records ) అందుకున్నారు. లండన్‌లో వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన అవార్డుల వేడుకలో దేవాన్ష్ కు అవార్డును ప్రదానం చేశారు. వేగవంతంగా చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన సందర్భంగా అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) దేవాన్స్‌కు అభినందనలు తెలిపారు. గురువుల మార్గనిర్దేశంలో నెలలపాటు కష్టపడి ఈ ఘనత సాధించాడని పేర్కొన్నారు. 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ రికార్డు పట్ల గర్విస్తున్నానని అన్నారు.
నారా దేవాన్ష్ తండ్రి , ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదను పెడుతూ , ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాన్ష్ చెస్ నేర్చుకున్నాడని తెలిపారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని అన్నారు. నారా దేవాన్ష్ గతంలోనూ చెస్ డొమైన్లో రెండు రికార్డులు సాధించారు.