Chandrababu | జగన్‌కు ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగుతున్న ప్రతిపక్ష హోదాపై (Opposition status) తొలిసారి చంద్రబాబు స్పందించారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న జగన్(Jagan) వాదనకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఇస్తే హోదా.. గెలిపిస్తే పదవి వస్తాయని అన్నారు. నేరాలు, బెదిరింపులతో హోదా, పదవులు రావని చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ(Assembly) లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ అసెంబ్లీ స్పీకర్‌కు వినతి పత్రాలు సమర్పించారు. ఆ హోదా ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో కనీసం 23 సభ్యులుండే పార్టీకే ప్రతిపక్ష హోదా వస్తుందని కూటమి మంత్రులు అసెంబ్లీ సమావేశంలోనే తేల్చి చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం స్పందించి 11 సభ్యులు గల వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మొన్నటి ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి 164 సీట్లను కైవసం చేసుకోగా వైసీపీ కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. 2019 -24లో వైసీపీకి 151 స్థానాల్లో విజయం సాధించి ఐదేండ్ల పాటు అధికారంలో కొనసాగింది.
Read more : Tirumala | ఒంటిపై 25 కిలోల బంగారంతో.. తిరుమలలో గోల్డెన్ బాయ్స్ సందడి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం!
Name change | ఏపీ విద్యాశాఖలో ఆరు ప్రభుత్వ పథకాలకు పేరు మార్పు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

