అమరావతి : రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra babu ) కు రైతుల ఉసురు తగలడం ఖాయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) అన్నారు. బుధవారం కడప జిల్లా పులివెందుల బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి, గిట్టుబాటు ధరతో పాటు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు దిగజారిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరటి పంట టన్నుకు రూ. 30 వేలు రాగా కూటమి హయాంలో కనీసం రూ. 2 వేలకు కూడా కొనేవాడు లేడని అన్నారు
. 17 నెలల టీడీపీ కూటమి పాలనలో 16 విపత్తులు రాగా రైతులకు కనీస సహాయం అందించలేదని ఆరోపించారు. అన్నదాత సుఖీభ కింద రూ.40 వేలు ఇస్తామని హామి ఇచ్చి రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.