అమరావతి: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనాలను కూల్చివేయడం కక్షపూరిత చర్య అని మాజీ మంత్రి, వైసీపీ (YCP) నాయకుడు అంబటి రాంబాబు(Ambati Rambabu) పేర్కొన్నారు. చట్టబద్దంగా ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న కార్యాలయం కూల్చివేయడం ధర్మమేనా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu ) ను ప్రశ్నించారు.
స్వయంగా అసెంబ్లీలో తీర్మాణం చేసి నిర్మిస్తున్న వైసీపీ పార్టీ కార్యాలయాల(Party Offices) ను కూల్చడం సముచితం కాదని అన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అనేక చోట్ల ప్రభుత్వ స్థలాల్లో టీడీపీ కార్యాలయాను నిర్మించిందని , తాడేపల్లిలోనూ టీడీపీ ఆఫీసు ప్రభుత్వ స్థలంలోనే నిర్మించారని గుర్తు చేశారు.
తాము అధికారంలోకి వస్తే కక్షసాధింపు చర్యలు ఉండబోవని అంటూనే విధ్వంసక చర్యలు పాల్పడుతుండడం సబబేనా అంటూ నిలదీశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వ చర్యను ఖండించాలని కోరారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో తమకు 11 మంది ఎమ్మెల్యేలున్నా 40 శాతం మంది ఓటర్లు తమకు ఓట్లు వేశారని తెలిపారు.