అమరావతి : వైసీపీ నాయకుడు , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ట్విటర్ వేదిక ద్వారా సీఎం చంద్రబాబుపై (CM Chandra Babu) మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్విటర్ (Twitter) ద్వారా ఆరోపణలు, విమర్షల స్థాయిని ఆయన పెంచారు.
తాజాగా శుక్రవారం చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇంతకు ఆయన ఏమన్నాడంటే. ప్రపంచం ఎంతో మారింది. కానీ చంద్రబాబు మారడు. పుట్టిన దగ్గర నుంచి అవే అబద్ధాలు. అవే మోసాలు. జ్ఞానం కలగాల్సిన వయస్సులో కూడా ఏమాత్రం సంకోచించక, వెనకాడకుండా పాపాలు చేస్తూనే ఉన్నాడని విమర్శించారు. నరకం ఇతనికి చాలదు. యముడు ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. ఆ యముడ్ని కూడా చంద్రబాబు తప్పు దారి పట్టిస్తాడేమోనంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ట్విటర్లో పేర్కొన్నారు.