తిరుపతి : సాలకట్ల బ్రహోత్సవాల సందర్భంగా తిరుమలలో (Tirumala) గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామికి మానవరూప స్వరూపమైన సుదర్శన చక్రత్తాళ్వార్ కు పవిత్ర చక్రస్నానం (Chakrasnam) నిర్వహించారు. వేలాది మంది భక్తులు పవిత్ర చక్రంతో పాటు స్వామి పుష్కరిణి(Pushkarini) తీర్థంలోని దివ్య జలాల్లో గోవిందా.. గోవిందా అంటూ భక్తి పారవశ్యంతో పవిత్ర స్నానమాచరించారు.
ముందుగా శ్రీదేవి భూదేవి, చక్రత్తాళ్వార్ తో కలిసి ఉన్న శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ దేవతలకు అర్చకులు వేద స్తోత్రాల మధ్య స్నపన తిరుమంజనం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , అధికారులు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చక్రస్నానం సందర్భంగా వెయ్యి మంది పోలీసులు, 1,300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్డీఆర్ఎప్, ఫైర్, తదితర విభాగాల నుంచి140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు.