అమరావతి : వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ, జనసేన నాయకులపై జరిగిన అరాచకాలపై కూటమి ప్రభుత్వంలో వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన ముఖ్య నాయకులపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వైసీపీ (YCP) కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు ప్రధాన నాయకులపై కేసులు కడుతున్నారు.
నిన్న మాజీ మంత్రి కొడాలినానిపై (Kodali Nani) కేసు నమోదు కాగా తాజాగా వైసీపీ నాయకుడు, గుంటూరు మేయర్ (Guntur Mayor) కావటి మనోహర్‌నాయుడిపై(Manohar Naidu) పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా టీడీపీ ,జనసేన నిర్వహించిన ఆందోళనపై మేయర్ పోలీసుల లాఠీ తీసుకుని టీడీపీ, జనసేన నాయకులను దూషిస్తూ దాడికి యత్నించారు.
టీడీపీ నాయకులు అప్పుడే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మరోసారి స్థానిక టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మేయర్‌తో పాటు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు అయ్యింది.