టీడీపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రేవేటి కరణ వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన సీనియర్ రాజకీయవేత్త బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష. చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి మండలం అర్తమూరు,కోనూరు, శివరాం గ్రామాలలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు, మండలంలో నాయకులు ఎంపీపీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొనడం జరిగింది.
సీనియర్ రాజకీయవేత్త బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబం మొత్తం దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో ప్రజాసేవలో ఉన్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయన గతంలో చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి కిమిడి కళావెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజానికి ఈ స్థానానికి పోటీ చేయడానికి కిమిడికి అంతగా ఇష్టం లేకపోయినా, పార్టీ సీటు ఇచ్చిందని పోటీ చేశారు.అయితే ఇదే టైంలో బొత్స కూడా తన కుటుంబం నుంచి కూతుర్ని కొడుకుని రాజకీయాల్లో తేవాలని ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్లే ఇటీవల పరిణామాలు కనిపిస్తున్నాయంటున్నారు బొత్స అభిమానులు.
చాలాకాలం తర్వాత బొత్స కుటుంబం నుంచి ఆయన వారసురాలిగా బొత్స అనూష రాజకీయరంగ ప్రవేశం చేస్తుందని టాక్ వచ్చింది. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ బొత్స కుటుంబం నుంచి రాలేదు. అయితే ఇటీవల మాజీ ఎంపీ బొత్స ఝాన్సీతో కలసి, బొత్స అనూష వివిధ కార్యక్రమాలకు హాజరైంది. ఇది చూసిన బొత్స అభిమానులు వైసీపీ కార్యకర్తలు బొత్స అనూష రాజకీయాల్లోకి రాబోతుందని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.
బొత్స గారికి కుమారుడు, కూతురు ఉన్నారు. వీరిద్దరూ డాక్టర్లే. ఎక్కడైనా డాక్టరు యాక్టర్లవ్వడం చూశాం కానీ పొలిటీషయన్లు అవ్వడం చాలా తక్కువ. కానీ బొత్స కుటుంబంలో ఉదయం నుంచి నిద్రపోయేవరకు అంతా రాజకీయాలే! దీంతో బొత్స పిల్లలకు రాజకీయాలు నేర్పించాల్సినవసరం లేదు. వారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే కాదనేవారు లేరు. అయితే ఇటీవల బొత్స అనూష వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె ఫామ్ చూస్తుంటే మళ్ళీ చీపురుపల్లిలో బొత్స కుటుంబం ఫామ్ లోకి తెచ్చేందుకు కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టున్న నేత బొత్స గత కూటమి గాలిలో పరాజయం పాలయ్యారు.
స్థానికంగా క్యేడర్ మీద బొత్స కుటుంబానికి గట్టి పట్టుంది. ఈసారి చీపురుపల్లిపై మళ్ళీ పట్టు సాధించేందుకు కొత్త స్ట్రాటజీతో కూతుర్ని ఇప్పట్నుంచే పోటీలో నిలబెట్టేందుకు సంసిద్ధం చేస్తున్నారా?
అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. బొత్స అనూష వృత్తిరీత్యా డాక్టర్. ఆమె ప్రజలనాడిని గట్టిగా పట్టేస్తుందని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లున్నారు. ఇదే అభిప్రాయాన్ని పార్టీ క్యేడర్, బొత్స అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. అనూష రాక క్యేడర్లో ఉత్సాహాన్ని ఇస్తోంది.
బొత్స సత్యనారాయణ వెనక ఉండి, అనూషని ముందుకు నడిపిస్తున్నట్లు, క్యేడర్ ఫీల్ అవుతున్నారు. ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతోన్న ప్రజాఉద్యమం నిరసన కార్యక్రమంలో గాయపడిన కార్యకర్తల కుటుంబాలను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం, వారికి ఆర్థికసాయం అందించడం, ఏవైనా కార్యక్రమాలు ఉంటే బొత్స సత్యనారాయణ తరఫున
అనూష హాజరవ్వడం కార్యకర్తల ఊహాలకి బలం చేకూరుస్తోంది. ఇవేకాకుండా ఈ కార్తీక వనసమారాధాన, కార్తీకమాస కోటీ దీపోత్సవం, వివిధ సంఘాల కార్యక్రమాలకు కూడా అనూష హాజరైంది. దీనికితోడు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవల్ లో బొత్స అనూష తిరగడం, ప్రజల సమస్యలను, ఇబ్బందులను సమీక్షిస్తూ.. సోషల్‌మీడియా ద్వారా భరోసా కల్పిస్తున్నారు.
వివిధ వర్గాలకు అందుబాటులో ఉంటూ అవసరమైనప్పుడల్లా ప్రజలకు మద్దతును తెలుపుతున్నారు. బొత్స సతీమణి గతంలో జెడ్పీటీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. రానున్న లోకల్ ఎలక్షన్స్‌లో పట్టుకోసం.. బొత్స అనూషని పోటీలో నిలిపేందకు ఏమైనా స్ట్రాటజీ అప్లై చేయనున్నారా? లేదంటే బొత్స అనూషతో కొత్త ప్లాన్ ఏమైనా రెడీ చేస్తున్నారా? అన్నది చీపురుపల్లి పార్టీ కార్యకర్తలు, బొత్స అభిమానులు చర్చించుకుంటున్నారు.