అమరావతి : మాజీ మంత్రి , వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ట్వీట్‌పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) ఘాటుగా స్పందించారు. బొత్స వ్యాఖ్యలపై సెటైర్లు సంధించారు. భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్(Jagan) మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..? పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ అని ఆరోపించారు.
ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు.. Now AP in Safe Hands.. Dont Worry..ప్రజలకు అన్ని విషయాలు తెలుసు..సమావేశమయ్యాక.. అన్ని తెలుస్తాయని పేర్కొన్నారు.
మాజీ మంత్రి , వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ శనివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇద్దరు సీఎంల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం(Live broadcast) చేయాలని సూచిస్తూ్ పోస్టు చేశారు. పోర్టుల్లో, టీటీడీ(TTD) ఆస్తుల్లో తెలంగాణ వాటాల అంశం ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని వెల్లడించారు.