Boat accident | ఇసుక దిబ్బను ఢీకొట్టి బోల్తాపడిన మత్స్యకారుల బోటు
Boat accident | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడినప్పటికీ.. స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించి ఏడుగురు మత్స్యకారుల ప్రాణాలను కాపాడారు.
Boat accident : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడినప్పటికీ.. స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించి ఏడుగురు మత్స్యకారుల ప్రాణాలను కాపాడారు. కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సుమారు ఏడు రోజుల క్రితం ఒక బోటులో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు.
వేట ముగించుకుని వస్తున్న క్రమంలో నర్సాపురం మండలం చిన్నలంక సమీపంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తూ ఇసుక దిబ్బను ఢీకొట్టి సముద్రంలో బోల్తా పడింది. దాంతో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు ప్రాణాలను రక్షించుకోవడానికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం చేసిన ఆర్తనాదాలను చిన్నలంక గ్రామస్తులు విన్నారు.
వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు సముద్రంలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టి, ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు బాధితులను చిన్నలంకలోని పునరావాస కేంద్రానికి తరలించి, ప్రమాదానికిగల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

