నెల్లూరు: సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిన గంటల వ్యవధిలోనే సినిమా హాల్ సమీపంలో భారీ పేలుడు సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దం, ఆ వెంటనే మంటలు ఎగిసిపడటంతో స్థానిక ప్రజలంతా భయంతో పరుగులు తీశారు.
స్థానికంగా ఉన్న మైథిలీ సినిమా హాల్ వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లపై బిల్లు తీసుకొచ్చిన కొద్దిగంటల్లోనే సంభవించిన ఈ పేలుడుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే బాణాసంచా పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పేలుడుకు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.