అమరావతి : రాష్ట్రంలో జూన్ 15 నుంచి నిర్వహించనున్న ఎస్ఐఆర్లో వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. సోమవారం పార్టీ పార్లమెంటరీ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సర్ ప్రక్రియపై ఓటర్లను చైతన్యవంతం చేయాలని, బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్వోల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలకు ముందే బీఎల్ఏలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సెప్టెంబర్ వరకు అన్ని టీమ్లు, సీనియర్ నాయకులు, ఇన్ఛార్జులు నిరంతర పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ తరగతులను నిర్వహించి వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు.