Badvel by election | బద్వేల్లో వైసీపీ గెలుపు దాదాపు ఖరారైపోయింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు ఆమె.. ఆ మెజారిటీని క్రాస్ చేశారు. ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆమె 60,785 ఓట్ల మెజారిటీతో ముందంజ ఉన్నారు. మరో నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపే మిగిలి ఉండటంతో వైసీపీ గెలుపు దాదాపు ఖరారైనట్లే.