తిరుపతి: ఆయుర్వేద విద్యార్థులు ఆయుర్వేద మూల గ్రంథాలపై పట్టు సాధించాలని యూరోపియన్ ఆయుర్వేద అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సురేష్ స్వర్ణపురి అన్నారు . శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ సురేష్ తిరుపతికి వచ్చిన సందర్భంగా ఎస్ వి ఆయుర్వేద కళాశాల విద్యార్థులతో సమావేశమయ్యారు . యూరోపియన్, పాశ్చాత్య దేశాల వారు ఆయుర్వేద ఆహారపు సూత్రాలను తెలుసుకోవడానికి , వాటిని ఆచరించడానికి ఉత్సాహం చూపిస్తారని తెలిపారు.
బ్రిటిష్ పార్లమెంట్లో నాలుగు సార్లు ఆయుర్వేద వైద్యంపై ప్రసంగించే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. అక్కడి ప్రభుత్వం ప్రజలు ప్రాచీన ఆయుర్వేద వైద్యానికి ఎంతో ప్రాధాన్యత గౌరవం ఇవ్వడమే ఇందు కారణమన్నారు. ఆయుర్వేద వైద్య విద్యార్థులు ఆయుర్వేద సూత్రాలను చక్కగా అర్థం చేసుకుని టీటీడీ కల్పించే సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.