అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు (Constable Suicide ) పాల్పడ్డాడు. వంశీశ్రీనివాస్ (Vamsi Srinivas) అనే ఏఆర్ కానిస్టేబుల్ (AR constable ) ఎస్కార్ట్‌లో విధులు నిర్వహిస్తూనే ఎస్కార్ట్ కారులో తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాక్ నుంచి కాల్చుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించారు. గుంటూరులో చుట్టుగుంటలో నివాసం ఉంటోన్న కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలపై ఉన్నతాధికారుల విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు, ఆర్థిక కారణాలు, విధుల్లో ఒత్తిడి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.