APSRTC | ఏపీఎస్ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 23.71 కోట్ల ఆదాయం
APSRTC | సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ నడిపిన బస్సుల వల్ల రోజుకు రూ. 20 కోట్లు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది.
అమరావతి : సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) నడిపిన బస్సుల వల్ల రోజుకు రూ. 20 కోట్లు రికార్డుస్థాయిలో ఆదాయం ( Income) వచ్చింది. ఈనెల 20న ఒక్కరోజే రూ.23. 71 కోట్లు ఆర్జించడం ఏపీ చరిత్రలో ప్రథమమని ఆర్టీసీ ఎండీ,డీజీపీ ద్వారకా తిరుమలరావు (RTC MD Tirumala rao) వెల్లడించారు.
సాధారణ ఛార్జీలతోనే ఈ నెల 8 నుంచి 20 వరకు 11 రోజుల పాటు 9 వేల 97 ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆయన తెలిపారు. ఈ సీజన్లో మరో మూడు రోజుల పాటు రోజుకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్లు వివరించారు. సంక్రాంతి సీజన్ మొత్తంలో ప్రత్యేక బస్సుల ద్వారానే రూ. 21.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ తెలిపింది.పండగ సీజన్లో మొత్తం 7200 బస్సులు నడపాలని ముందుగా నిర్ణయించిన ఆర్టీసీ, ప్రయాణికుల రద్దీ వల్ల అంతకన్నా ఎక్కువగా 9097 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వెల్లడించారు.
రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు Chandra Babu) ఆదేశాల మేరకు ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల బస్సులను కూడా వివిధ ప్రాంతాల్లో నడిపినట్లు ఆయన తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్ల అంకిత భావం, కృషి ఫలితంగానే ఆర్టీసీ ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులందరికీ ఆర్టీసీ ఎండీ ప్రత్యేక దన్యావాదాలు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

