AP Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.