AP News | నీ ఆరోపణలకు ఆధారాలు చూపించు.. జగన్‌కు పల్లా సవాలు
AP News | వైఎస్ జగన్ మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. వ్యక్తిగత హత్యలను టీడీపీకి రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని జగన్‌ను డిమాండ్ చేశారు.
AP News | వైఎస్ జగన్ మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. వ్యక్తిగత హత్యలను టీడీపీకి రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని జగన్‌ను డిమాండ్ చేశారు.
వినుకొండ బాధితులను పరామర్శించేందుకు వెళ్లి ఏపీలో రాష్ట్రపతి పాలన కోరడం, గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటామనడం జగన్ దివాళాకోరుతనానికి నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టేన రాజకీయ ప్రేరేపిత కేసులను 100 రోజుల్లో చట్టబద్ధంగా ఎత్తివేయించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. వారంలో రెండు రోజులు కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని చెప్పారు. నిబద్ధతతో పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు దక్కుతాయని తెలిపారు. కార్యకర్తల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యను టీడీపీకి అంటగట్టడంపైనా పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రషీద్ హత్యకు జిలానీ కారణమని.. వాళ్ల మధ్య సంవత్సరం నుంచే గొడవలు ఉన్నాయని తెలిపారు. ఏడాది కిందట అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర పంచాయతీ కూడా జరిగిందని అన్నారు. ఆ పంచాయతీ తేలకపోవడంతోనే ఈ హత్య జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తన ఉనికిని కాపాడుకునేందుకే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

