అమరావతి: ఏపీ టీడీపీ అధ్యక్షుడు , ఎమ్మెల్యే కింజవరపు అచ్చెనాయుడుకు సోమవారం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎత్తివేసింది . ఈఎస్ఐ స్కామ్లో ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేయగా గతంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టులో కేసు విచారణ ముగిసే వరకు దేశం విడిచి వెళ్లొద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెనాయుడు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా మందులు, పరికరాల కొనుగోలులో ముగ్గురు అధికారులతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అతడిపై విచారణ జరిపించాలని ఏసీబీకి ఆదేశించడంతో ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి అచ్చెనాయుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించింది. దీంతో కోర్టును ఆశ్రయించిన అచ్చెనాయుడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా నేడు కొన్ని షరతులను విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది.