AP News | తహశీల్దార్ నుంచి 50 లక్షలు కాజేసిన నకిలీ ఏసీబీ అధికారి.. ఐదేళ్ల తర్వాత అరెస్టు
AP News | ఏసీబీ అధికారిగా నటించి తహశీల్దార్‌ను బురిడీ కొట్టించి రూ.50 లక్షలు కాజేసిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మోసగాడినికి చివరకు సత్యసాయి జిల్లాలో అరెస్టు చేశారు.
AP News | ఏసీబీ అధికారిగా నటించి తహశీల్దార్‌ను బురిడీ కొట్టించి రూ.50 లక్షలు కాజేసిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మోసగాడినికి చివరకు సత్యసాయి జిల్లాలో అరెస్టు చేశారు.
అసలేమైందంటే.. 2021లో అనంతపురం జిల్లా ముదిగబ్బులో తహశీల్దార్‌గా పనిచేస్తున్న అన్వర్ హుస్సేన్‌కు ఓ వ్యక్తి కాల్ చేశాడు. తాను ఏసీబీ అధికారిని అని నమ్మించాడు. అవినీతి కేసులు పెట్టిస్తానని భయపెట్టి రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. భయపడిపోయిన తహశీల్దార్ వెంటనే నకిలీ ఏసీబీ అధికారికి రూ.50 లక్షలు ఇచ్చాడు. డబ్బు చేతిలో పడగానే కాల్ చేసిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. అప్పట్లోనే మోసపోయానని గ్రహించిన అన్వర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన ఎరుకల హనుమంతుగా గుర్తించారు.
అయితే గత ఐదేళ్లుగా హనుమంతు ఆచూకీ దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు సాంకేతిక ఆధారాలు, గోప్య సమాచారంతో నిందితుడి కదలికలను కొంతకాలంగా గమనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

