అమరావతి : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల అధికంగా మహిళలు , యువతులు అదృశ్యమయ్యారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా (Minister Roja) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడారు. ముందుగా పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) వల్ల ఎంత మంది మహిళలు అదృశ్యమయ్యారో లెక్క తేలాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంసథ నివేదిక ఇచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. పవన్ మాటాలు గురవింద గింజ సామెతలా ఉన్నాయని మండిపడ్డారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమ (Rayalaseema ) లో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు ( Chandrababu )అని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులకు పరిశీలించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. హెరిటేజ్ లో గంజాయి, నారావారిపల్లిలో ఎర్రచందనం దొరుకుతుందని ఆమె ఆరోపణలు చేశారు.