Chandrababu | చంద్రబాబు బెయిల్‌కు ఏపీ హైకోర్టు పెట్టిన 5 షరతులు ఇవే!
Chandrababu | స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ కోర్టు (AP High court) ఆయనకు మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరుచేసింది.
Chandrababu | స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ కోర్టు (AP High court) ఆయనకు మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరుచేసింది. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తి చేసిన కోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరుచేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
5 షరతులు ఇవే!
- రూ.లక్ష పూచీకత్తుతోపాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలి.
- నచ్చిన దవాఖానలో సొంత ఖర్చుతో చికిత్స చేయించుకోవచ్చు.
- చికిత్స, దవాఖాన వివరాలను జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలి.
- కేసును ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రభావితం చేయకూడదు.
- నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కావాలి.
స్కిల్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్‌తోపాటు.. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది.
సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును నంద్యాలలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చంద్రబాబు లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ వచ్చినప్పటికీ ఏసీబీ కోర్టు తిరస్కరిస్తున్నది. ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నేడు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. మొత్తంగా 52 రోజులపాటు రాజమండ్రి జైలులో చంద్రబాబు గడిపారు.
Also Read..
Israel – Hamas War | బందీల వీడియో రిలీజ్ చేసిన హమాస్.. ఇజ్రాయెల్ విధానాన్ని తప్పుపట్టిన మహిళ
Mukesh Ambani | అంబానీకి 4 రోజుల్లో మూడో బెదిరింపు మెయిల్.. ఈసారి 400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

