Israel – Hamas War | బందీల వీడియో రిలీజ్ చేసిన హమాస్.. ఇజ్రాయెల్ విధానాన్ని తప్పుపట్టిన మహిళ
Israel – Hamas War | అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా (Hostages) చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. తాజాగా తమ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు మహిళల (three hostages ) వీడియోను హమాస్ విడుదల చేసింది.
Israel – Hamas War | అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా (Hostages) చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. తాజాగా తమ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు మహిళల (three hostages ) వీడియోను హమాస్ విడుదల చేసింది. అందులో ఓ మహిళ ఇజ్రాయెల్‌ను తప్పుపడుతూ మాట్లాడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
76 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో హమాస్ చెరలో బందీగా ఉన్న మహిళ మాట్లాడుతూ.. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. గత 23 రోజులుగా తాము హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు మహిళ పేర్కొంది. బందీల విడుదల కోసం గాజాలో ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేస్తోందని తమకు తెలిసిందని.. అయితే, భద్రతా కారణాలు, సైనిక వైఫల్యం కారణంగా తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తమను నిజంగా కాపాడాలనుకుంటే.. ముందు పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టి.. ఆ తర్వాత హమాస్ చెరలోని తమను విడిపించాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు హమాస్ వద్ద బందీగా ఉన్న మహిళా సైనికురాలిని విడిపించుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ప్రకటించింది. గాజాలో భూతల దాడుల సందర్భంగా ఆమెను రక్షించినట్లు వెల్లడించింది.
Also Read..
Benjamin Netanyahu | అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్లే.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
Israeli – Hamas | మా పిల్లలందర్నీ విడిపించండి.. ఇజ్రాయేల్ ప్రధానితో గాజా బంధీల కుటుంబాల మొర
Israel woman | హమాస్ ఉగ్రవాదుల చెరలో బంధీగా ఉన్న జర్మన్ యువతి మృతి.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

