విజయవాడ : (AP Electricity) విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నది. ఫలితంగా రాష్ట్రంలో రైతులకు పగటి సమయంలో 9 గంటల విద్యుత్ ఇచ్చేందుకు వీలు చిక్కనున్నది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. వచ్చే 25 ఏండ్లపాటు ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేకుండా ఈ ఒప్పందం భరోసా ఇస్తుందని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎస్ఈఎల్) ద్వారా రానున్న 25 సంవత్సరాల వరకు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. వ్యవసాయానికి అందించే విద్యుత్ యూనిట్ ప్రస్తుతం సగటున రూ.4.36 లకు కొనుగోలు చేస్తున్నామని, సెకీతో ఒప్పందం కారణంగా ఇది రూ.2.49 కే వస్తుందని చెప్పారు. దీంతో యూనిట్‌పై దాదాపు రూ.1.87 ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఇలా ఏడాదికి రూ.2,400 కోట్ల వరకు ఆదా అవుతుందని శ్రీకాంత్ వెల్లడించారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కలుపుకొని వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..