Ukraine War | ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపాలన్న వాన్స్.. మరి ట్రంప్ ఏమన్నారో తెలుసా..?
Ukraine War | ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని ముగించేందుకు గతంలో చర్చలు జరుగుతున్న సమయంలో భారత (India) సైన్యాన్ని శాంతి పరిరక్షక దళంగా పంపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన ఓ దశలో అమెరికా (USA) అత్యున్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది.
Ukraine War : ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని ముగించేందుకు గతంలో చర్చలు జరుగుతున్న సమయంలో భారత (India) సైన్యాన్ని శాంతి పరిరక్షక దళంగా పంపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన ఓ దశలో అమెరికా (USA) అత్యున్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఆలోచనను అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెంటనే పక్కన పెట్టినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది.
అమెరికా జర్నలిస్టులు మ్యాగీ హాబర్‌మన్, జోనాథన్ స్వాన్ రాసిన ‘రెజీమ్ ఛేంజ్: ఇన్సైడ్ ది ఇంపీరియల్ ప్రెసిడెన్సీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్నిరోజులకే వైట్‌హౌస్‌లో జరిగిన కీలక సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ఆ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికరమైన సూచన చేసినట్లు పుస్తకం చెబుతోంది.
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ అమలైతే అక్కడ శాంతి పరిరక్షణ కోసం యూరప్‌కు వెలుపల ఉన్న దేశాల సైన్యాన్ని వినియోగించవచ్చా..? అని ఆయన ప్రశ్నించినట్లు రచయితలు పేర్కొన్నారు. ఆ సందర్భంలో భారత్ పేరును కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనపై ట్రంప్ నవ్వుతూ స్పందించినట్లు పుస్తకంలో ఉంది. ‘భారతీయులు అలా చేయలేరు. అలాంటి వ్యవహారాల కోసం ఖర్చు పెట్టరు’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు రచయితలు పేర్కొన్నారు.
అదే సమయంలో ప్రధాని మోదీతో తనకు ఉన్న స్నేహాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించినట్లు పుస్తకం వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ మొదటి నుంచీ ఒకే విధమైన వైఖరిని కొనసాగిస్తోంది. యుద్ధానికి బదులుగా చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పదేపదే చెబుతోంది. ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని ప్రధాని మోదీ పలుమార్లు స్పష్టంచేశారు. అయితే ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. ఈ అంశం భారత్‌లో కూడా చర్చకు వచ్చింది.
2025 ఏప్రిల్‌లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ అమలైతే పరిమిత స్థాయిలో శాంతి దళాలను పంపే అవకాశాన్ని పరిశీలించవచ్చని అభిప్రాయపడ్డారు. యూరప్ వెలుపల ఉన్న దేశాలు కూడా శాంతి పరిరక్షణలో పాత్ర పోషించవచ్చని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భారత సైన్యానికి విశేష అనుభవం ఉంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దక్షిణ సూడాన్, సోమాలియా, లెబనాన్ వంటి దేశాల్లో భారత బలగాలు గతంలో సేవలందించాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ విషయంలో అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ చర్చకు రాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

