అమరావతి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) మంగళవారం ఏపీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గన్నవరానికి (Gannavaram airport) చేరుకున్న ఆమెకు విమానాశ్రయం లో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu), డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawankalyan) పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం విమానాశ్రయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముర్ము రోడ్డుమార్గంలో మంగళగిరికి చేరుకున్నారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రతాప్రావు జాదవ్, రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్, దుర్గేష్, సంధ్యారాణి మంగళగిరికి చేరుకున్నారు.