శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 15, 2021 , 12:45:51

గోపూజలో ఏపీ సీఎం జగన్‌

గోపూజలో ఏపీ సీఎం జగన్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నరసరావుపేటకు చేరుకున్నారు. మొదట స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గోపూజలో పాల్గొన్నారు. టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా ఏపీ వ్యాప్తంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం చేపట్టారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

VIDEOS

logo