వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కరీమున్సీసా మృతి పట్ల ఏపీ సీఎం దిగ్భ్రాంతి

అమరావతి : గుండెపోటుతో మరణించిన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా భౌతికకాయానికి ఏపీ సీం జగన్మోహన్రెడ్డి నివాళులర్పించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. “నా సోదరి కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం.
ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సీఎం వెంట హోం మంత్రి సుచరిత, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీ కోసం పని చేశారు. ఈ ఏడాది మొదట్లో ఆమె ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. శుక్రవారం శాసనమండలిలో ఆమె సీఎం జగన్ను, శాసనమండలి చైర్మన్గా నూతనంగా ఎన్నికైన మోషేన్ రాజును కలిశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

