Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. బస్సు ప్రమాదం గురించి తెలియగానే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.
కర్నూలు బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమని తేలితే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రమాదానికి గురైన బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని అన్నారు. మృతుల కుటుంబాలకు త్వరితగతిన ఆర్థిక సాయం అందజేస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని ముఖ్యమంత్రికి ఆయన వివరించారు. ఇక, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో బస్సుల్లో సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

