తిరుమల జిల్లా : ఏపీకి చెందిన ఓ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్‌కు చెందిన ఆయుర్వేద అకాడమి ఫెలోషిప్‌ను సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. తమ ప్రొఫెసర్‌కు ఎఫ్బీఏఏ లభించడం పట్ల తిరుమల ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల వైద్యులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కే హర్షవర్ధన్ అప్పాజీకి అరుదైన గౌరవం అందుకున్నారు. ఈయనకు బ్రిటిష్ ఆయుర్వేద అకాడమీ (ఎఫ్బీఏఏ) ఫెలోషిప్ నుంచి సర్టిఫికేట్ లభించింది. ఈయనను ఎఫ్బీఏఏ గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవాన్ని కూడా అందుకున్నారు. లండన్ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ నుంచి డాక్టర్ హర్షవర్ధన్ అప్పాజీ ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. డాక్టర్ హర్షవర్ధన్‌ను లండన్ పార్లమెంటరీ కార్యదర్శి పాల్ స్కల్లీ అభినందించారు. ఈ సందర్భంగా లండన్‌లోని అసోసియేషన్ ఆఫ్ ఆయుర్వేద అకాడమీ (ఏఏఏ) ఆధ్వర్యంలో ఎఫ్బీఏఏ కోర్సును నిర్వహిస్తున్న డాక్టర్ సురేష్, జోషిలకు డాక్టర్ హర్షవర్ధన్ అప్పాజీ కృతజ్ఞతలు తెలిపారు.
తమ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ హర్షవర్ధన్ అప్పాజీ బ్రిటన్ ఆయుర్వేద ఆకాడిమీ ఫెలోషిప్ నుంచి సర్టిఫికేట్ అందుకోవడం తమకెంతో గర్వకారణమని ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల అధ్యాపకులు చెప్పారు. మున్ముందు బ్రిటన్ అకాడమీతో కలిసి పనిచేయడం ద్వారా ఆయుర్వేదానికి సముచిత స్థానం కల్పించేందుకు వీలుంటుందని వారు అభిప్రాయపడ్డారు. డాక్టర్ హర్షవర్ధన్ అప్పాజీని ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు కూడా అభినందించారు.