అమరావతి : ఏపీ అసెంబ్లీ (AP assembly ) సమావేశాలు నిరవధికంగా వాయిదా (Indefinitely postpone) పడ్డాయి. పదిరోజుల పాటు జరిగిన సమావేశాలు శుక్రవారంతో ముగిసాయి. దాదాపు 60 గంటలపాటు సమావేశాలు జరిగాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) తెలిపారు.
ఈ సమావేశాల్లో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో 120 మంది సభ్యులు ప్రసంగించారని వివరించారు. సమావేశాల్లో చివరి రోజు మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. వీటిలో విశాఖ డెయిరీ అక్రమాలపై సభాసంఘం వేయాలని నిర్ణయించామని స్పీకర్ వెల్లడించారు. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారని వివరించారు. ఏపీ కౌన్సిల్ సమావేశాలు సైతం శుక్రవారంతో ముగిసాయి.