(AP ACB Report) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ తన వార్షిక నివేదికను వెల్లడించింది. రాష్ట్రంలో నెలకు ఆరుగురు చొప్పున అవినీతిపరులు ఏసీబీ వలకు చిక్కగా.. రెవెన్యూ శాఖ టాప్‌లో నిలిచింది. ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల్లో సగానికి సగం మంది రెవెన్యూ శాఖ వారు ఉన్నారు. 11 క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు, 26 సాధారణ విచారణలు, 45 ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు నివేదికలో తెలిపారు.
విశాఖ జిల్లా చోడవరం మండలం తాశీల్దారుగా పని చేసిన బీ రవికుమార్ రూ.4.50 లక్షలు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తాశీల్దారు బీ నాగభూషణరావు రూ.4 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో అత్యధిక మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిలో టాప్‌లో ఉన్నారు. ఈ ఏడాదిలో నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల్లో అత్యధికంగా ఎంబీసీడబ్యూడీ కార్పొరేషన్ ఎండీ బీ నాగభూషణం ఉన్నారు. ఈయన వద్ద రూ.10.79 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు.
అవినీతిపై ఫిర్యాదుల టోల్‌ఫ్రీ నంబరు 14400 కు 2,851 ఫిర్యాదులు అందగా.. వాటి ఆధారంగా 8 ట్రాప్ కేసులు, 16 రెగ్యులర్ విచారణలు జరిపారు. ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసిన వారిలో రెవెన్యూ శాఖలో 36 మంది, విద్యుత్ శాఖలో 8, పంచాయతీరాజ్‌లో 7, హోం శాఖలో 6, పట్టణాభివృద్ధి శాఖలో ఐదుగురు, ఇతర శాఖలకు చెందిన పది మంది ఉన్నారు.
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..