Avatar 3 | హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విజువల్ వండర్ “అవతార్: ఫైర్ అండ్ యాష్” (అవతార్ 3) ఎట్టకేలకు ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఈ విజువల్ వండర్ బుధవారం సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులు వీక్షించవచ్చు. ‘అవతార్’ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ మూడో భాగంలో దర్శకుడు జేమ్స్ కామెరాన్ సరికొత్త ప్రపంచాన్ని చూపించారు. మొదటి భాగంలో అడవులు, రెండో భాగంలో సముద్ర గర్భాన్ని అన్వేషించిన ఆయన.. ఈ ‘ఫైర్ అండ్ యాష్’లో ‘యాష్ పీపుల్’ (బూడిద తెగ) అనే క్రూరమైన స్వభావం గల సరికొత్త నావి క్లాన్ను పరిచయం చేశారు.
A darker side of Pandora awaits.
Avatar: Fire and Ash now streaming in English, Hindi, Tamil, Telugu, Kannada and Malayalam on JioHotstar. pic.twitter.com/qahnkwXjb9
— JioHotstar Tamil (@JioHotstartam) June 24, 2026