ఏపీ సెక్రటేరియట్లో కరోనా కలకలం.. మరో ఉద్యోగి మృతి
సెక్రటేరియట్| రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తున్నది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా మరో ఉద్యోగి కూడా మహమ్మారి వల్ల చనిపోయారు. సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జీ. రవికాంత్ ఇవాళ కరోనాతో మృతిచెందారు. రెండు రోజుల్లో ఇద్దరు సచివాలయ ఉద్యోగుల మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,224 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,55,455కు చేరాయి. ఇందులో 40469 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 9,07,598 మంది డిశ్చార్జీకాగా, మరో 7388 మంది మృతిచెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా సోకకుండా టీకా ఆపలేదు: ప్రొఫెసర్ అనూప్ మలానీ
మోదీజీ.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి : కపిల్ సిబల్
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు కరోనా
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

