అమరావతి : కర్నూలు లో జరిగిన రోడ్డు ప్రమాదం (Kurnool Bus Fire ) ఘటన వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు ప్రమాదంలో దగ్ధమై 19 మంది సజీవదహనమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ మరో 27 మందిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు.
బస్సులో కాలిబూడిదైన ప్రయాణికుల పోస్టుమార్టం అనంతరం బస్సును జాతీయ రహదారి నుంచి పక్కకు తప్పించే యత్నంలో మరో ప్రమాదం జరిగింది. బస్సును క్రేన్ సహాయంతో రోడ్డు కిందకు దించుతుండగా ఒక్కసారిగా క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌ను స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి క్యాబిన్లో ఉన్న ఆపరేటర్‌ను సురక్షితంగా బయటకు తీశారు.