బుధవారం 21 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 03, 2020 , 16:20:19

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై ఏపీ ప్ర‌భుత్వం నిషేధం

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై ఏపీ ప్ర‌భుత్వం నిషేధం

అమ‌రావ‌తి : యువ‌త‌ను త‌ప్పుడు మార్గాల్లోకి నెట్టేస్తున్న‌ రమ్మీ, పోకర్ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆటలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట‌ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.  సీఎం వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన మంత్రివ‌ర్గం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచార‌శాఖ మంత్రి పేర్ని వెంక‌ట‌రామ‌య్య‌(నాని) తెలిపారు. మంత్రివ‌ర్గ స‌మావేశం అనంత‌రం మీడియాతో మంత్రి మాట్లాడుతూ... ఆన్‌లైన్ జూదం యువ‌త‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తూ చీక‌ట్లోకి నెడుతుంద‌న్నారు. కావునా యువ‌త‌ను కాపాడేందుకే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. కేబినెట్ నిర్ణ‌యం ప్ర‌కారం మొద‌టిసారి నేరానికి పాల్ప‌డితే ఆన్‌లైన్ జూదం నిర్వాహ‌కుల‌కు జ‌రిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష అనుభ‌వించ‌నున్న‌ట్లు తెలిపారు. రెండోసారి పాల్ప‌డితే జ‌రిమానాతో పాటు జైలు శిక్ష రెండేళ్ల‌కు పెర‌గ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడేవారికి ఆరు నెల‌ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని మంత్రి తెలిపారు. 


logo