Andhra Minister | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అధికార పార్టీ అండతో కొందరు నేతలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మంత్రి (Andhra Minister) బంధువు ఏకంగా పోలీసుపై దౌర్జన్యం చేశారు. అందరి ముందు కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించారు (Ministers Brother Slaps Cop). ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో చోటు చేసుకుంది.
ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి (BC Janardhan Reddy) సోదరుడు బీసీ మదన్ భూపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి కొలిమిగండ్ల (Kolimigundla) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ జశ్వంత్.. సెక్యూరిటీ కారణాల రిత్యా ఆలయంలోకి పంపడం సాధ్యం కాదంటూ మదన్ భూపాల్‌రెడ్డి, అతని అనుచరులకు చెప్పారు. వారిని ఆలయం వెలుపల ఆపేశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సోదరుడు కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. నన్నే ఆపుతావా అంటూ ఆగ్రహంతో కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాజా ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఘటనపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు డ్యూటీలో ఉన్న పోలీసులపై మంత్రి సోదరుడు నేరుగా దాడికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
In a shocking incident, the brother of TDP Minister B.C. Janardhan Reddy slapped a police constable on duty, openly displaying the arrogance and lawlessness associated with TDP leaders and their families. The assault happened in public view, yet no immediate action was taken,… pic.twitter.com/CqgMDVeAVk
— YSR Congress Party (@YSRCParty) July 31, 2025
Also Read..
AP Police Constable Results | ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల..
తిరుమలలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు : టీటీడీ
YS Jagan | ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబుకు భయమెందుకు ? : వైఎస్ జగన్