అమరావతి : పట్టుదలకు తోడు ప్రతిభను కనబరుస్తున్న ఆంధ్ర యువకుడు ఐపీఎల్ క్రికేట్ పోటీలకు ఎంపికయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విన్ హెబ్బార్‌ను నిన్న బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్ దక్కించుకుంది. ఇప్పటికే వివిధ చోట్ల జరిగిన క్రికెట్ పోటీల్లో బ్యాట్మెన్గా రాణిస్తున్న అశ్విన్‌ను ఐపీఎల్ ద్వారా తన సత్తాను మరింత చాటనున్నాడు.
ఐపీఎల్ వేలానికి ప్రపంచ వ్యాప్తంగా 1300 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. వారిలో 599 పేర్లను సెలెక్ట్ చేసిన సెలెక్టర్లు జాబితాలో బ్యాట్‌మెన్ అశ్విన్ హెబ్బార్ 57వ స్థానంలో ఉండడం గమన్హారం. మార్చి 26 నుంచి జరుగునున్న ఐపీఎల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల అశ్విన్, అతడి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా మంచి ప్రతిభతో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిలో పడుతానని అశ్విన్ పేర్కొన్నాడు. తమ కుమారుడికి ఐపీఎల్లో చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉందని అశ్విన్ తల్లిదండ్రులు రాజ్గిరి, నళిని తెలిపారు. ఐపీఎల్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
2021-22 లో సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్‌లు ఆడి 279 రన్స్ సాధించాడు. అతడి కేరిర్‌లో 41 టీ20 మ్యాచ్‌లు ఆడి 1117, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు 22 ఆడి 680 పరుగులు సాధించాడు.