అమరావతి : ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసినట్లు ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు(MP) విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) విమర్శించారు. గురువారం ట్విట్టర్ వేదిక ద్వారా ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. సైబర్ నేరాలు(Cyber Crimes) , మహిళలపై అరాచకాలు పెరుగుతున్నా వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగులు పెట్టారంటూ 680 మంది వైసీపీ కార్యకర్తలకు నోటీసులు అందించారని పేర్కొన్నారు. వీరిలో ఇప్పటికే 147 కేసులు నమోదు చేసి 49 మందిని అరెస్టు చేశారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల తమ ప్రాదాన్యతను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.