Bhuma Akhila Priya | ఏపీలోని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం W.గోవిందిన్నె గ్రామంలో మూలపెద్దమ్మ దేవరలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం W.గోవిందిన్నె గ్రామంలో జరుగుతున్న జాతరకు సోమవారం ఉదయం అఖిలప్రియ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్న ఆమె.. గండాదీపం మోశారు. ఈ క్రమంలోనే అలసట, అస్వస్థతకు గురైన ఆమె ఆలయంలోనే స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన అనుచరులు, పార్టీ శ్రేణులు ఆమెను అత్యవసరంగా ఆంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో భూమా అఖిలప్రియను పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఉపవాస దీక్షలో ఉండటంతోనే అలసిపోయి స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
భూమా అఖిలప్రియకు అస్వస్థత
W. గోవిందిన్నెలో మూల పెద్దమ్మ దేవరలో స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్యే అఖిలప్రియ
దొర్నిపాడు మండలం W. గోవిందిన్నెలో ఓ జాతరకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అఖిలప్రియ
ఉపవాస దీక్షలో ఉండడంతోనే స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం
ప్రస్తుతం ఆళ్లగ… pic.twitter.com/GSsyK9IWvn
— BIG TV Breaking News (@bigtvtelugu) June 9, 2025