అమరావతి: కర్నూలు జిల్లాలో పెద్దపులి మృతి ఘటనపై అధికారులు నలుగురిపై చర్యలు తీసుకున్నారు. పెద్ద కంబలూరు అటవీ సెక్షన్ అధికారి శ్రీనివాసరెడ్డిని సస్పెన్షన్ చేశామని నంద్యాల డీఎఫ్‌వో వినీత్‌కుమార్ వెల్లడించారు. బీట్ ఆఫీసర్ జేమ్స పాల్‌ను సస్పెండ్, ప్లాంటేషన్ వాచర్ బాషా,మైకేల్‌ను విధుల నుంచి తొలగించామన్నారు.
వారం క్రితం వేటగాళ్ల ఉచ్చులో పెద్దపులి మృతి చెందిందని ఇందుకు స్థానిక అధికారి, సిబ్బంది బాధ్యతరాహిత్యమే కారణమని విచారణలో తేలిందని పేర్కొన్నారు.