అమరావతి : ఏపీలో మహిళలపై దాడులు కలవరానికి గురి చేస్తున్నాయి. విశాఖపట్నంలో (Visakapatnam) ఓ అగంతకుడు బస్సుపై యాసిడ్తో దాడి (Acid attack ) చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా ప్రయాణికులకు ( Female Passengers) గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
విశాఖ కంచెరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి బస్ ఎక్కి తన వెంట తెచ్చుకున్న యాసిడ్తో మహిళలపై దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా ప్రయాణికులపై పడిందని విశాఖ పోలీస్ కమిషనర్ ( Commissioner of Police ) తెలిపారు.
గాయపడ్డ మహిళలను ఊర్వశి జంక్షన్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని తెలిపారు.