పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అమరావతి: పులివెందుల పులినని గొప్పలు చెప్పుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
అమరావతి: పులివెందుల పులినని గొప్పలు చెప్పుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇది ఆయన రాజకీయ పిరికితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకనే జగన్ ఎన్నికల ప్రక్రియను వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు.
ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి కనీసం తన ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా రాజకీయ నాటకాలకు తెరలేపడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ భయానక రాజకీయాలతో పులివెందులలో ఆధిపత్యం కొనసాగించిన వైసీపీకి.. ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలను ఎదుర్కోవడం చేతకావడం లేదని విమర్శించారు. మహిళలు, వృద్ధులు, సామాన్య ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వస్తుంటే వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు, బెదిరింపులతో భయోత్పాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతును పొందలేకపోతే హింసాత్మక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
పోలింగ్ సందర్భంగా రాళ్ల దాడులు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఎన్నికల ప్రక్రియను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్లను అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పులివెందుల అంటే జగన్ కుటుంబానికి రాజకీయ జాగీరు కాదని, అక్కడి ప్రజలు ఎవరికీ బానిసలు కారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు పొందే రోజులు పోయాయని అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందలేక హింసాత్మక వాతావరణం సృష్టించి, ఇతరులపై నిందలు వేయడం వైసీపీ రాజకీయ అలవాటుగా మారిందని విమర్శించారు.
ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటు వేయకుండా వెనుదిరిగి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందని, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

